చంద్రయాన్‌-2 ఖ‌ర్చు ఎంతంటే..?

-

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో గతి తప్పడంతో ప్రయోగం విఫలమైన సంగతి తెలిసిందే. అయితే చంద్రయాన్‌-2 గురించి లోక్‌సభలో ఆసక్తికర చర్చ నడిచింది. లోక్‌సభ సమావేశాల్లో భాగంగా కేంద్రానికి ఓ ప్రశ్న ఎదురైంది. చంద్రయాన్‌-ఖర్చు, తయారీ వివరాలు చెప్పాలంటూ ప్ర‌శ్నించారు. దీనిపై పార్లమెంటులో కేంద్రమంత్రి జితేందర్ సింగ్ సమాధానం ఇచ్చారు.

చంద్రయాన్-2కు అయిన మొత్తం ఖర్చును కూడా మంత్రి సభకు వివరించారు. ‘దేశంలోని ప్రతి భారతీయుడు గర్వపడేలా ఇస్రో చంద్రయాన్‌-2ను ప్రయోగించింది. జులై 22న GSLV MK III-M1 వాహక నౌక ద్వారా దీన్ని అంతరిక్షంలోకి పంపింది. చంద్రయాన్‌-2 కక్ష్యను పెంచుకుంటూ పోయి 276 x 1,42,975 కి.మీకు చేర్చారు. ఐదు సార్లు కక్ష్యను పెంచారు. సెప్టెంబరు 7న సాఫ్ట్‌ ల్యాండింగ్‌లో భాగంగా విక్రమ్‌ ల్యాండరు చంద్రుడి ఉపరితలం వైపుగా దిగడం మొదలైంది.

చంద్రుడి ఉపరితలానికి మరో 500 మీటర్ల దూరంలో ఉండగా ల్యాండరులో సాంకేతిక సమస్యల తలెత్తినట్లు ఇస్రో ఛైర్మన్‌ కె. శివన్‌ ప్రకటించారు. అయినప్పటికీ ఇస్రో శ్రమను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. మన దేశ ఔన్నత్యాన్ని మరింత పెంచే విధంగా శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించారు. ఈ ప్రాజెక్టు మొత్తానికి రూ.978కోట్లు ఖర్చయింది’ అని జితేందర్ సింగ్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version