బ్యాంకుల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ర్టంలో అన్ని బ్యాంకుల పనివేళలను తాత్కాలికంగా తగ్గించేందుకు రాష్ర్టస్థాయి బ్యాంకర్ల సమితి సిద్ధమవుతుంది. మే 15వరకు బ్యాంకుల పనివేళలు తగ్గించి, సగం మంది సిబ్బందితోనే నిర్వహించేలా చర్యలు తీసుకోనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు సేవలందించనున్నట్లు తెలుస్తుంది. శుక్రవారం నుంచి పనివేళలు మార్పు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.