ఇంట్లో కరెంట్‌ పోయిందా? అయితే ఇలా చేస్తే సమస్యకు పరిష్కాం!

-

అసలే ఎండా కాలం.. ఈ సమయంలో కరెంట్‌ పోయిందనుకోండి.. అమ్మో! ఎలా ఉంటుంది. ఆ ఉక్కపోతాను మనం తక్కుకోలేం. అయితే ఇలా చేస్తే నిమిషాల్లో మీ సమస్యకు పరిష్కాం దొరుకుతుంది. అదేంటో తెలుసుకుందాం. సాధారణంగా మన ఇంట్లో కరెంటు పోతే లైన్‌మెన్‌ నంబర్‌కు సంప్రదిస్తాం. అయితే, అది ఒకవేళ సమయానికి కలవకపోతే మన ఏరియా విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు కాల్‌ చేస్తాం. అది కూడా అందుబాటులో లేకపోతే ఎలా? ఇందుకోసమే టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌తో మీరు సులభంగా విద్యుత్‌ సంబంధిత ఫిర్యాదులు చేయవచ్చు. తరచూ కాకున్నా..అప్పుడప్పుడు విద్యుత్‌ సమస్య ఏర్పడుతుంది. అది ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోవడం, ఓవర్‌ లోడింగ్‌ వివిధ సమస్యలు కారణాలు కావచ్చు. వానా కాలం అయితే తప్పకుండా కరెంట్‌ పోతుంది. అయితే కొన్నిసార్లు అందుబాటులో ఉన్న కాల్‌ సెంటర్‌కు కాల్‌ చేస్తే కొన్ని టెక్నికల్‌ సమస్యల వల్ల పనిచేయవు.


అయితే ఈ సమస్య పరిష్కారానికి ఎర్రగడ్డలో స్కాడా కార్యాలయం ఏర్పాటు చేశారు.
24 గంటలూ పనిచేసే ఈ కాల్‌ సెంటర్‌ పనిచేస్తుంది. ఈ మధ్య వరసగా హైదరాబాద్‌లో ఈదురుగాలుల నేపథ్యంలో తరచూ కొన్ని ప్రాంతాల్లో కరెంట్‌ పోతుందని, వినియోగదారుల ఫిర్యాదు నంబర్‌ 1912కు కాల్‌ చేస్తే లైన్‌ కలవడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. సాధారణంగా ఈ కాల్‌ సెంటర్‌ సామర్థ్యం 30, ఒకేసారి 60 మించిన కాల్స్‌ వీరు స్వీకరించలేరు. కొన్ని సందర్భాల్లో మూడువేల కాల్స్‌ కూడా వస్తున్నాయి. ఇలా వచ్చిన ఫిర్యాదుల సమాచారాన్ని సదరు సబ్‌ స్టేషన్‌ వ్యక్తులకు చేరవేయటంలో కూడా సమస్యలు ఎదురువుతున్నాయి. వీటన్నింటికి పరిష్కారంగా

దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థకు ‘టీఎస్‌ఎస్పీడీసీఎల్‌’ పేరుతో ఓ యాప్‌ ఉంది. ఈ యాప్లో ఫిర్యాదు చేయడం చాలా సులువు. ఈ యాప్‌ ఓపెన్‌ చేసిన తర్వాత మొబైల్‌ నంబర్, మీ కరెంట్‌ బిల్లుపై ఉండే యూనిక్‌ నంబర్‌ తో రిజిస్టర్‌ చేసుకోవాలి. యాప్‌లో ‘కన్జూమర్‌ సర్వీసెస్‌’ నొక్కగానే ‘నో పవర్‌ కంప్లైంట్‌’ అని ఉంటుంది.

దాన్ని క్లిక్‌ చేస్తే ‘యూనిక్‌ సర్వీస్‌ నెంబరు’ కన్పిస్తుంది. సబ్మిట్‌ నొక్కితే.. ఫిర్యాదు నమోదవుతుంది. దీంతో మీరు ఏ ప్రాంతం నుంచి ఫిర్యాదు చేశారో ఆ స్థానిక సిబ్బందికి సమాచారం వెళ్లగానే వారు వచ్చి సమస్యను పరిష్కరిస్తారు. సమస్య మీ ఇంట్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో అయితే దానిలో దానికి సబందించిన ఒక ఆప్షన్‌ కూడా ఉంది. అక్కడ ‘గెస్ట్‌ యూజర్‌’ ఆప్షన్‌ లోకి వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. అంతే కాకుండా కరెంట్‌ బిల్లుల వివరాలను కూడా తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version