వాట్సప్‌ గ్రూపుల్లో చేరడం ఇష్టం లేకపోతే ఇలా సెట్టింగ్‌ మార్చుకోండి!

-

మీకు ఇష్టం లేకున్నా, మిమ్మల్ని వాట్సప్‌ గ్రూప్స్‌లో యాడ్‌ చేస్తున్నారా? అయితే ఇలా చేస్తే మీ అనుమతి లేకుండా వాట్సప్‌ గ్రూప్స్‌లో మిమ్మల్ని యాడ్‌ చేయలేరు. కాకపోతే మీ ఫోన్‌లో వీటికి కొన్ని సెట్టింగ్‌లు మార్చుకోవాల్సి ఉంటుంది. వాట్సప్‌ గ్రూప్స్‌ అద్భుతమైన ఫీచర్‌. కుటుంబ సభ్యులు, రిలేటివ్స్, స్నేహితులు, ఆఫీస్‌ కొలీగ్స్,  ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో గ్రూప్‌ ఉంటుంది.


సాధారణంగా అందరి అప్‌డేట్స్‌ తెలుసుకోవడానికి, రెగ్యులర్‌గా టచ్‌లో ఉండేందుకు ఈ గ్రూప్స్‌ ఉపయోగపడుతుంటాయి. అయితే ఈ గ్రూప్స్‌ కొన్ని సందర్భాల్లో వినియోగదారులకు తలనొప్పిగా మారుతుంటాయి. ఎవరంటే వాళ్లు గ్రూప్స్‌లో యాడ్‌ చేస్తూ ఉంటారు. పర్మిషన్‌ తీసుకోకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా గ్రూప్స్‌లో యాడ్‌ చేస్తుంటారు. ఒక్కోసారి మనల్ని యాడ్‌ చేసినా, ఆ గ్రూప్‌లోంచి ఎగ్జిట్‌ అవ్వడానికి మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ, చిన్న సెట్టింగ్‌ మార్చడంతో వీటి నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు. దీనికి మీరు చేయవల్సింది.

  • ముందుగా వాట్సప్‌ యాప్‌ ఓపెన్‌ చేయండి.
  • అందులో కుడివైపు కార్నర్‌లో మూడు చుక్కలు ఉంటాయి. దానిపై క్లిక్‌ చేయండి.
  • సెట్టింగ్స్‌పై క్లిక్‌ చేయండి. ఆ తర్వాత అకౌంట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి. ప్రైవసీ సెలక్ట్‌ చేసి అందులో గ్రూప్స్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.
  • అందులో Everyone, My contacts, My contacts except, nobody except my contacts
  • Everyone క్లిక్‌ చేస్తే మిమ్మల్ని ఎవరైన యాడ్‌ చేయవచ్చు.
  • My contacts పై క్లిక్‌ చేస్తే మీ కంటాక్ట్‌ లో ఉన్నవారు యాడ్‌ చేయవచ్చు.
  • My contacts except ని సెలెక్ట్‌ చేసుకుంటే మీ కాంటాక్ట్‌లో కొంత మందిని గ్రూప్‌ లో యాడ్‌ చేయకుండా అడ్డుకట్ట వేయవచ్చు.
  • nobody ఆప్షన్‌ సెలెక్ట్‌ చేస్తే మిమ్మల్ని గ్రూప్‌లో ఎవరూ యాడ్‌ చేయలేరు.
    ఒకవేళ మీకు తెలియకుండా మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్‌ చేసేందుకుంటే గ్రూప్‌ ఇన్విటేషన్‌ లింక్‌ వస్తుంది. మీరు ఆ గ్రూప్‌లో జాయిన్‌ కావద్దనుకుంటే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఆ లింక్‌ను అలాగే వదిలేయాలి. ఇక మీకు ఏదైనా గ్రూప్‌లో మీరు చేరాలనుకుంటే ఏ గ్రూప్‌లో చేరాలనుకుంటున్నారో ఆ గ్రూప్‌ అడ్మిన్ కు మీ నంబర్‌ యాడ్‌ చేయమని చెప్పండి. మీకు గ్రూప్‌ ఇన్విటేషన్‌ లింక్‌ వస్తుంది. ఆ లింక్‌ మూడు రోజుల పాటు యాక్టీవ్‌లో ఉంటుంది. మీరు యాక్సెప్ట్‌ చేస్తేనే ఆ గ్రూప్‌లో యాడ్‌ అవుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version