సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్ష పేపర్ విధానాన్ని మార్చారు. 2021-22 సెషన్ నుండి తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇవి మారనున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని అన్ని పాఠశాలలకు పంపించారు. బోర్డు ప్రకారం చిన్న ప్రశ్నలు మరియు పెద్ద ప్రశ్నలు పదవ తరగతి వాళ్లకి మరియు 12వ తరగతి వాళ్ళకి 10 శాతం తగ్గించారు.
ఇప్పటి వరకు పదవ తరగతి పరీక్షల్లో 70 శాతం చిన్న ప్రశ్నలు, పెద్ద ప్రశ్నలు ఇచ్చేవారు. అదే విధంగా 12వ తరగతి వాళ్లకి 60 శాతం చిన్న ప్రశ్నలు, పెద్ద ప్రశ్నలు అడిగేవారు. వీటిని పది శాతానికి తగ్గించింది బోర్డు. అదే విధంగా ఎబిలిటీ కి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువ ఉండేటట్టు యాడ్ చేశారు.
న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కింద దీనిని తీసుకు వచ్చారు. దీనితో విద్యార్థుల ఆలోచనా విధానం సామర్థ్యం పెరుగుతుంది. ఇప్పటి వరకు కూడా సామర్థ్యానికి తగిన ప్రశ్నలు అడిగేవారు కాదు. ఈ కొత్త విధానానికి సంబంధించి శాంపిల్ క్వశ్చన్ పేపర్ ని విడుదల చేస్తామని అన్నారు.
ఈ విధంగానే పాఠశాలలో కూడా విద్యార్థులకు పాఠాలు చెప్పాలి అని చెప్పారు. 9 మరియు పదవ తరగతి వాళ్లకి సామర్థ్యానికి తగ్గ ప్రశ్నలు 30 శాతం ఉంటాయి. మల్టిపుల్ చాయిస్, కేస్ స్టడీ, ఇంటిగ్రేటెడ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. మరియు 20% ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి అదే విధంగా చిన్న ప్రశ్నలు, పెద్ద ప్రశ్నలు 60 శాతం నుంచి 50 శాతం వరకు ఉంటాయి. 11వ తరగతి మరియు 12 వ తరగతికి 20 శాతం సామర్థ్యంపై ప్రశ్నలు ఉంటాయి.