మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి కొత్తగా చెప్పుకోక్కర్లేదు రామ్ చరణ్ చిరు తనయుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు తను నటనతో గ్లోబల్ స్టార్ అయిపోయారు. సినిమాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో రాంచరణ్ ఫ్యామిలీకి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఫ్యామిలీ కోసం ఎక్కువ టైం ని కేటాయిస్తూ ఉంటారు. సరదాగా గడుపుతూ ఉంటారు.
ఉమెన్స్ డే సందర్భంగా చరణ్ తన తల్లి భార్య కోసం చెఫ్ గా మారిపోయారు. ఎంత క్యూట్ గా ఉన్నారు అని అందరూ అంటున్నారు వారికి ఇష్టమైన వంట చేసి పెట్టి తల్లి సురేఖ భార్య ఉపాసన కి స్పెషల్ విషెస్ చెప్పారు తన తల్లి కోసం చరణ్ ఏకంగా పన్నీర్ టిక్కా కర్రీ తన చేతులతో వండి పెట్టారు అంతేకాకుండా దోశలు కూడా వేసి అందరినీ సంతోషపరిచారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.