వీడియో వైర‌ల్ : ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ చూసి గంతులేసిన చ‌రణ్, తారక్

-

ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ సామాన్యుల నే కాదు.. సెల‌బ్రెటీల ను సైతం ఉర్రుత‌లూగిస్తుంది. డిసెంబ‌ర్ 9 న విడుద‌ల అయిన ఈ ట్రైల‌ర్.. మ్యానియా ఇప్పుడే త‌గ్గేట్టు లేదు. సామాన్యుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు అంద‌రూ ఈ ట్రైల‌ర్ ను ఎంజయ్ చేస్తున్నారు. తాజా గా ఆర్ ఆర్ ఆర్ సినిమా ట్రైల‌ర్ ను హీరో లు రామ్ చ‌ర‌ణ్.. ఎన్టీఆర్ తో పాటు డైరెక్ట‌ర్ రాజ‌మౌళి చూశారు. అనంత‌రం చ‌ర‌ణ్, తార‌క్ లు ఏకం గా గంతులు వేశారు. రాజ‌మౌళి ని ప‌ట్టు కుని డ్యాన్స్ చేశారు.

ఎంటీ ఈ బీభ‌త్సం అంటూ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ని తార‌క్ ఆలింగ‌నం చేసుకున్నారు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియా ఫుల్ వైర‌ల్ అవుతుంది. కాగ ఈ సినిమా పాన్ ఇండియా లెవ‌ల్ వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక గా జ‌న‌వ‌రి 7 న విడుద‌ల కానుంది. కాగ ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్లు అజయ్ దేవగన్, అలియా భట్, కోలీవుడ్ నటుడు సముద్రఖని, హాలీవుడ్ నటులు ఒలివియా మోరిస్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ కీలక పాత్రలలో క‌నిపించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news