గుంటూరు జిల్లా నరసరావుపేట లో ఇటీవల కలెక్టర్ శామ్యూల్ వ్యవహరించిన తీరుపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒక వైద్యు డునీ సస్పెండ్ చేయాలి అంటూ ఆయన ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ విషయంలో కలెక్టర్ వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. నాదెండ్ల ప్రభుత్వ వైద్యాధికారి సోమ్లా నాయక్ కు చార్జ్ మోమో జారీ చేశారు.
నరసరావుపేట లో కోవిడ్ సమీక్ష లో డాక్టర్ సోమ్లానాయక్ కు కలెక్టర్ కు వాగ్వివాదం జరిగిన సంగతి విదితమే. డాక్టర్ సోమ్లా నాయక్ ను అరెస్ట్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం ఆ తర్వాత కలెక్టర్ ఆదేశాలపై విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం జరిగాయి. ఐదు గంటల పాటు పోలీసు స్టేషన్ లో ఉన్న డాక్టర్ సోమ్లా నాయక్ కు వైద్య వర్గాలు అండగా నిలిచాయి. వెనక్కు తగ్గి సోమ్లా నాయక్ ను స్టేషన్ నుంచి విడుదల చేశారు. గొడవకు సంబందించిన వివాదం పై వివరణ కోరుతూ జిల్లా వైద్యాధికారి చార్జ్ మోమో జారీ చేశారు.ప్రస్తుతం సోమ్లా నాయక్ వ్యక్తిగత సెలవులో ఉన్నారు.