బాబును పనిగట్టుకునిమరీ అడ్డంగా ఇరికించేసిన వర్ల రామయ్య! 

-

కొంతమందికి మైకు దొరికితే పూనకం వచ్చేస్తుంటుంది.. ఏమి మట్లాడుతున్నాం.. దానివల్ల మనకు కలిగే నష్టం ఏమిటి అనే ఆలోచన కొంచెం కూడా చేయరు! వారిలో ప్రథమ స్థానం కోసం పోటీపడే టీడీపీ లీడర్లలో వర్ల కూడా ఒకరు! ఒకానొక సమయంలో టీవీ డిబేట్లలో బాబూ రాజేంద్రప్రసాద్ కూడా ఇలానే అత్యుత్సాహంతో వెనక ముందూ చూడకుండా మాట్లాడి బాబును చాలా సార్లు ఇబ్బందులకు గురిచేశారు! అనంతరం అశోక్ బాబు కూడా నేనున్నాను అంటూ రంగంలోకి దిగారు! ఇప్పుడు వర్ల కూడా అదేశైలిలో పయణిస్తున్నారు!
వివరాల్లోకి వెళ్తే… మాజీ ద‌ళిత మేజిస్ట్రేట్ రామ‌కృష్ణ విషయంలో టీడీపీ ఫుల్ హడావిడి చేస్తుంది. ఒక దళిత వ్యక్తికి ఈ ప్రభుత్వంలో ఇబ్బంది ఎదురైతే దానిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది ప్రతిపక్షమే! కానీ… ఆ ప్రశ్నించే క్రమంలో సెల్ఫ్ గోల్స్ వేసుకుంటే మొదటికే మోసం వస్తోంది మరి! ఈ క్రమంలో మాజీ ద‌ళిత మేజిస్ట్రేట్ రామ‌కృష్ణ విషయంలో మైకందుకున్న వర్ల… “కొంద‌రు పెద్ద‌ల దౌర్జ‌న్యానికి గురైన ద‌ళిత మేజిస్ట్రేట్ రామ‌కృష్ణ ఎనిమిదేళ్లుగా న‌ర‌క‌యాత‌న అనుభవిస్తున్నారు” అని అన్నారు! సరిగ్గా ఇక్కడే రామయ్య దొరికిపోయారు!
నిజంగా రామకృష్ణ ఎనిమిదేళ్లుగా నరకయాతన అనుభవిస్తుంటే… జగన్ వచ్చి ఏడాది అయ్యింది.. మిగిలిన ఏడేళ్లలో ఐదేళ్లు అధికారంలో ఉంది వర్ల రామయ్య పార్టీ అయిన టీడీపీనే కదా! మరి ఈ విషయంలో నాడు రామయ్య ఏమి చేసినట్లు. అంటే… నాడు టీడీపీ ఐదేళ్ల పాలనలో దళితులపట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఇట్టే అర్ధమవుతుంది కదా! వైకాపా నుంచి లాజిక్!! అదే నిజమైతే… వర్ల రామయ్య.. బాబుని అడ్డంగా ఇరికించేసినట్లే!
నేడు ఈ మాజీ మెజిస్ట్రేట్ రామకృష్ణ విషయంలో “దళితులపై దాడి” అని ట్విట్టర్ వేదికగా బాబు, లోకేష్ సహా టీడీపీ నేతలంతా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.. కరక్టే! కానీ… గతంలో దళితులపై వారికున్న ప్రేమ గురించి కూడా స్పందించాలి కదా! నాడు “మేము కళ్లు మూసుకుపోయి పాలించాం… ఈ ప్రభుత్వం కూడా అలా పాలిస్తే ఎలా.. దళితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి” అని టీడీపీ నేతలు చెప్పదలచుకున్నారా? తెలియదు కానీ… వర్ల రామయ్య మాత్రం పనిగట్టుకుని ఇరికించినట్లుగా బాబుని అడ్డంగా ఇరికించేస్తూ.. తనకు తాను దళితల విషయంలో గొంతెంత్తే నాయకుడిగా చెప్పుకునే వర్ల కూడా తన చిత్తశుద్ధి పట్ల క్లారిటీ ఇచ్చినట్లయ్యింది అని ఈ సందర్భంగా కామెంట్లు పడుతున్నాయి!

Read more RELATED
Recommended to you

Exit mobile version