ఇరాన్ అమెరికా మధ్య పరిస్థితులు రోజు రోజుకి దిగజారుతున్నాయి. తమపై ఆధిపత్యాన్ని ఎంత మాత్రం భరించలేని అమెరికా తన శత్రు దేశాల మీద పెత్తనం చెలాయించడానికి వ్యూహరచనలు చేస్తూ ఉంటుంది. ఇప్పటికే ముస్లిం దేశాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికా అక్కడ అస్థిరత నెలకొల్పి అక్కడి సంపదను భారీగా దోచుకుంటున్న సంగతి తెలిసిందే. అగ్ర రాజ్యం అనే పేరుతో ఇతర దేశాల మీద,
అనవసర పెత్తనం చెలాయిస్తూ ఆ దేశాలను నాశనం చేస్తుంది అమెరికా. ఇరాన్ కమాండర్ సులేమానీని అమెరికా హతమార్చడంతో ఇరాన్, ఇరాక్ దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రెండు దేశాల సరిహద్దుల్లో అమెరికా భారీగా సైన్యాన్ని మోహరించింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్ మొత్తాన్ని అమెరికా సైన్యం స్వాధీనం చేసుకోవడంతో పరిస్థితి మారిపోయింది. ఈ నేపధ్యంలో శత్రుదేశం ఇరాన్ కు,
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ లొంగకపోతే మరిన్ని దాడులు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే తీవ్ర దాడులకు దిగుతామన్న ఆయన… శత్రువులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని హెచ్చరించారు. అదే విధంగా శత్రువులను వేటాడి మరి చంపుతామన్నారు. మొత్తం 52 ప్రాంతాలను టార్గెట్ చేశామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.