రామగుండంలోని ఓపెన్ కాస్ట్-5లో విషవాయువులు వెలువడుతున్నాయి. దీంతో బొగ్గుగని కార్మికులు, ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు.బొగ్గు గనుల నుంచి ఇతర ప్రాంతాలకు పొగ వ్యాపిస్తుండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. గనిలో పనిచేస్తున్న కార్మికులు కేవలం నాలుగు గంటలే పని చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడే.. తెలంగాణ సింగరేణి గనుల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రామగుండంలోని సింగరేణి ఓపెన్ కాస్ట్-1లోని ఫేజ్-2లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బ్లాస్టింగ్‌కు సంబంధించిన ముడి పదార్థాలను నింపుతుండగా.. ప్రమాదవశాత్తూ ఈ పేలుడు చోటు చేసుకుంది. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం గోదావరఖనిలోని సింగరేణి హాస్పిటల్‌కు తరలించారు.