చెన్నైకి తొలి ఎస్సీ మేయర్ గా ప్రియారాజన్ ప్రమాణ స్వీకారం.. మూడో మహిళ మేయర్ గా రికార్డ్

-

చెన్నై నగరానికి తొలి ఎస్సీ మహిళ మేయర్ గా బాధ్యతలు స్వీకరించింది ప్రియా రాజన్. చెన్నై కార్పోరేషన్ కు ఓ ఎస్సీ మహిళ మేయర్ కావడం ఇదే తొలిసారి. డీఎంకే పార్టీ తరుపున గెలిచిన ప్రియారాజన్ తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల చెన్నై కార్పోరేషన్ మేయర్ పదవిని ఎస్సీ మహిళకు కేటాయించడంతో ప్రియా రాజన్ కు కలిసి వచ్చింది. ఇటీవల చెన్నై కార్పోరేషన్ కు నిర్వహించిన ఎన్నికల్లో 153 వార్డులను కైవసం చేసుకుని మెజారిటీ సాధించింది. 

దాదాపు 340 ఏళ్ల తరువాత చెన్నై నగరానికి దళిత అభ్యర్థి మేయర్ ఎన్నికైన తొలి దళిత అభ్యర్థిగా ప్రియా రాజన్ రికార్డు సృష్టించారు. ఇదిలా ఉంటే చెన్నైకి ఇప్పటి వరకు ఇద్దరు మహిళలు మాత్రమే మేయర్ పదవిని చేపట్టారు. 1957లో తారా సెరియన్ అనే మహిళ తొలిసారి చెన్నై కార్పొరేషన్​కు మేయర్​గా కాగా…  1971-72 మధ్య కామాచ్చి జయరామన్.. ఈ పదవిని చేపట్టిన రెండో మహిళగా నిలిచారు. ప్రస్తుతం ప్రియా రాజన్ మూడో మహిళా మేయర్ కానున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version