దర్ఫణ సుందరీ, భస్మమోహిని శిల్పాలు ఉన్న దేవాలయం విశేషాలు తెలుసా!!

-

ది కర్ణాటక రాష్ట్రంలోని హాసన్‌ జిల్లా బేలూరు పట్టణంలో వుంది. బేలూర్‌ కర్ణాటకలో ప్రముఖ పర్యాటక ప్రదేశం. అనేక ఆలయాలకు నెలవైన ఈ పట్టణం హసన్‌ జిల్లాలో బెంగుళూర్‌ నుండి కేవలం 220 కి. మీ. దూరంలో ఉంది. ఇది యగాచి నది ఒడ్డున కలదు , దీని ప్రాచీనమైన, విశిష్టమైన దేవాలయ. బేలూర్‌ విశిష్టమైనది బేలూర్‌ హోయసల రాజధానిగా ఉంది. ఇక్కడికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న హలేబేడ్‌ కూడా హోయసల రాజధానిగా ఉండేది ఇది పురాతన నగరం. ఈ నగరాలు హోయసల నిర్మాణ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.-

ఆలయ విశిష్టతలు: విష్ణు భగవానుడి కోసం నిర్మించిన ఈ ఆలయం గాలిగోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. అత్యంత రమణీయమైన దేవాలయాల్లో ఒకటైన చెన్నకేశవ దేవాలయం. దీన్ని మృదువైన సున్నపురాయిని ఉపయోగించి నిర్మించారు. ఈ ఆలయంలో విష్ణువు అవతారమైన చెన్నకేశవ స్వామికి అంకితం చేయబడినది. ఈ ఆలయంలో యవ్వనంలో ఉన్న మహిళల చిత్రాలు, సువర్ణ చిత్రాలు ఆకర్షిస్తుంటాయి. దీంతోపాటు పురాణాల్లోని అనేక గాథలను, ఉపనిషత్తులను, ఏనుగులు, రామాయణ మహాభారతాలలోని అనేక శిల్పాలను చూడవచ్చును. వివిధ భంగిమలలోని నర్తకిల శిల్పాలు, ద్వారాల దగ్గర ద్వారపాలకుల శిల్పాలు ఎంతో ఆకర్షణీయంగా వుంటాయి. అందులో ముఖ్యంగా దర్పణ సుందరి, భస్మ మోహిని అనేవి చెప్పుకోదగిన ఆకర్షణీయ శిల్పాలు.

42 అడుగుల మహాస్తంభం: ఆలయం అంతర్భాగంలోనే కప్పే చేన్నిగరాయ ఆలయం,  లక్ష్మీ దేవీకి అంకితం చేసిన ఒక చిన్న కట్టడం కూడా ఉన్నాయి. బేలూర్‌ గ్రావిటీ పిల్లర్‌ ఈ ఆలయానికి బయట 42 అడుగుల ధ్వజస్తంభం ఉంది. మహాస్తంభం లేదా కార్తిక దీపోత్సవ స్తంభం అని పిలవబడే ఈ 42 అడుగుల ఈ స్తంభం చెన్నకేశవ ఆలయ ప్రధాన ఆకర్షణలలో ఒకటి. దీని విశేషమేమిటంటే ఈ స్తంభం ఓక వైపు ఆధారం నేలను తాకి ఉండదు. మూడు వైపుల ఆధారం మీద నిలిచి ఉంటుంది. హోయసల శైలి శిల్పకళకు నిలువుటద్దంగా ఈ దేవాలయం వుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news