తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మధ్య ప్రదేశ్ పర్యటన ఖరారు అయింది. నేడు మధ్యప్రదేశ్‌కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరనున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేతలు కూడా నేడు మధ్యప్రదేశ్‌కు వెళ్లనున్నారు.
ఇక ఇవాళ తిరిగి సాయంత్రం హైదరాబాద్‌కు రానున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. మధ్యప్రదేశ్‌లోని మోవ్ ప్రాంతంలో ‘జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్’ నినాదంతో వెటర్నరీ గ్రౌండ్స్‌లో జరిగే సభలో పాల్గొననున్నారు సీఎం రేవంత్. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మధ్య ప్రదేశ్ పర్యటన ఖరారు అయింది.