ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జాంజ్ గిరి చంపా జిల్లాలో బోరుబావిలో పడిన బాలుడిని సురక్షితంగా రక్షించారు అధికారులు. ఏకంగా 104 గమటల పాటు సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బాలుడి ప్రాణాలను కాపాడారు. జూన్ 10 శుక్రవారం రోజుల పెరట్లో ఆడుకుంటున్న రాహుల్ సాహు అనే 10 ఏళ్ల బాలుడు నిరుపయోగంగా ఉన్న బోరు బావిలో పడిపోయాడు. అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నేషనల్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తో పాటు ఆర్మీ, కోల్ ఇండియా, స్థానిక పోలీస్, రెవెన్యూ యంత్రాంగం అంతా మోహరించారు. దాదాపుగా 500 మందికి పైగా సిబ్బంది కష్టపడి బాలుడిని రక్షించారు.
#WATCH | Chhattisgarh: 10-yr-old Rahul who fell into a borewell in Pihrid village of Janjgir-Champa district was successfully rescued after over 100 hours of operation. pic.twitter.com/HDsoRXvjt3
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 14, 2022