సీఎంకు కొరడా దెబ్బలు..! వీడియో వైరల్‌

-

చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ కొరడాతో కొట్టించుకున్నాడు. అదేంటి ఓ ముఖ్యమంత్రి కొరడాతో కొట్టించుకోవడం ఏంటని అనుకుంటున్నారా ? అవును ఇది నిజమే. అసలు వివరాల్లోకి వెళితే… చత్తీస్ గడ్ రాష్ట్రం లో ప్రతి ఏడాది ఆడంబరంగా గోవర్ధన పూజ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా గోవుకు విశిష్టమైన పూజలు నిర్వహించారు. ఆ తర్వాత భక్తులు కొరడా తో కొట్టించు కుంటారు.

ఇలా గోవర్ధన పూజ అనంతరం కొరడా దెబ్బలు తింటే సమస్యలు తొలగిపోతాయని వారి నమ్మకం. ఈ నేపథ్యంలోనే ఇవ్వాళ దుర్గ్ లో గ్రామంలో గోవర్ధన పూజ హాజరయ్యారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భుపేష్ భగేల్. ఈ సందర్భంగా.. సీఎం భూపేష్ ను కొరడా తో కొట్టారు బీరేంద్ర ఠాకూర్. ఇది తమ తరతరాల ఆచారమని.. ఇక్కడ ఇలాగే జరుగుతుందని సిఎం భూపేష్ పేర్కొన్నారు. అయితే సీఎం కొరడాతో కొట్టించుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో ను చూసిన నెటిజెన్స్ షాక్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version