బీసీలకు ముఖ్యమంత్రి జగన్ వెన్నుపోటు: పరిటాల సునీత

-

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో రాష్ట్ర రాజకీయాలు వేడి ఎక్కుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.ఈ క్రమంలోనే తెలుగు దేశం పార్టీ నేత పరిటాల సునీత ముఖ్యమంత్రి జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల ఆత్మగౌరవం నుంచే టీడీపీ పుట్టిందని మాజీ మంత్రి పరిటాల సునీత చెప్పారు. నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. బీసీలు వైసీపీకి వెన్నెముక అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్.. ఆయా వర్గాలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. అక్రమాలను ఎదిరించిన 2,540 మంది బీసీలపై వైసీపీ నేతలు దాడులు చేశారని, 75 మందికి పైగా హత్యకు గురయ్యారని ఆరోపించారు.

 Paritala Sunitha

అలాగే.. బీసీల ఆత్మగౌరవం నుంచి తెలుగు దేశం పార్టీ పుట్టిందని, నాడు ఎన్టీఆర్ నేడు చంద్రబాబు బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని మాజీ మంత్రి పరిటాల సునీత మీడియా సమావేశంలో అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news