తలసరి ఆదాయంలో నెంబర్‌వన్‌గా తెలంగాణ ఉంది -సీఎం కేసీఆర్

-

భారత 75 వ స్వాతంత్ర్య దినోత్సవం, ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాల’ సందర్భంగా, గోల్కండ కోటలో జాతీయ జెండా ను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ తలసరి ఆదాయంలో నెంబర్‌వన్‌గా ఉందన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిందని.. స్వాతంత్య్ర వజ్రోత్సవ దినోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

తెలంగాణ ఆర్థిక రంగంలో దూసుకు పోవడంతో పాటు అన్నపూర్ణగా మారిందన్నారు. రాష్ట్రం అపూర్వ విజయాలను సాధిస్తోంది. హరితహారం కార్యక్రమంతో ఆకుపచ్చగా మారిందని వెల్లడించారు సీఎం కేసీఆర్. దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం 84 శాతం ఎక్కువ.

రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు అనే పథకాన్ని గొప్పగా అమలు చేస్తోంది. దళితబంధు దేశానికి దిశానిర్ధేశం చేస్తోంది. ప్రభుత్వం వజ్రసంకల్పంతో దళిత బంధును అమలు చేస్తోందన్నారు సీఎం కేసీఆర్. తరతరాలుగా భారతదేశం నిలబెట్టుకుంటూ వస్తున్న శాంతియుత సహజీవనాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రాజ్యంగ పదవుల్లో ఉన్నవారే నేడు ఫాసిస్టు దాడులకు పాల్పడుతున్నారని కేంద్రంపై ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version