మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయలో బాల్య వివాహం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కండ్లకోయ గ్రామానికి చెందిన రాజు(21), ఆంద్రప్రదేశ్ నుంచి బ్రతుకుదేరువు కోసం వచ్చిన దంపతులకు చెందిన 13 ఏళ్ల బాలికతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ విషయం వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్లకు తేలవడంతో ఇరువురి కుటుంబాల మధ్య గొడవలు జరిగి పంచాయతీ దాకా వెళ్లారు. పంచాయతీ పెద్దగా వ్యవహరించిన ఒక ప్రజా ప్రతినిధి (ప్రభాకర్ వైస్ చైర్మన్,గుండ్ల పోచంపల్లి) ఇరువురు కుటుంబాల పెద్దవాళ్లకు సర్దిచెప్పి కండ్లకోయలోని చెరువు కట్టపై ఉన్నా అమ్మవారి ఆలయంలో దగ్గరుండి వివాహం జరిపించాడు. ఈ విషయంపై ఐసిడీఎస్ సూపర్ వైజర్ హైమావతిని వివరణ కోరగా బాల్య వివాహం తమ దృష్టికి రాలేదని అన్నారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.