అదానీతో కాంగ్రెస్, బీజేపీ అనుబంధం దేశానికే అవమానం : కేటీఆర్

-

అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్త్యంలో దాదాపు 20 శాతం మేర నష్టాల్లో షేర్లు కొనసాగుతున్నట్లు సమాచారం. గౌతమ్‌ అదానీపై అమెరికాలో కేసు నమోదు అయింది. సోలార్‌ ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌ కోసం నిధుల సేకరణకు 265 మిలియన్‌ డాలర్లు లంచం ఇచ్చారని ఆరోపణలు తెర పైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అదానీ పై అమెరికాలోని న్యూయార్క్ లో కేసు నమోదైన తరుణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అదానీతో కాంగ్రెస్, బీజేపీ అనుబంధం దేశానికే అవమానం అని అభిప్రాయపడ్డారు. ఆయన అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు అని పేర్కొన్నారు. భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడు అంటూ దుయ్యబట్టారు కేటీఆర్. రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీ, మూసీలో అదానీ వాటా ఎంత అని ప్రశ్నించారు. అలాగే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అమనుతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మీరు అదానీ తో చేసుకున్న చీకటి ఒప్పందాలు అన్నీ బయట పెట్టాలి! తెలంగాణా ఆస్తులను కొల్లగొట్టే మీ కుయుక్తులలో మీ భడే భాయ్ వాటాఎంత? మీ అదానీ భాయ్ వాటా ఎంత? మీ హైకమాండ్ వాటా ఎంత? అని ప్రశ్నించారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version