యాప్స్ నిషేధంపై తీవ్రంగా స్పందించిన చైనా..!

-

తమ దేశ సంస్థల యాప్స్ వినియోగాన్ని భారత్ రద్దు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఝావో లీజియన్ తెలిపారు.  దీన్ని తాము తీవ్రమైన చర్యగా భావిస్తున్నామని స్పష్టం చేశారు. అయితే ఇప్పటిదాకా చైనాకు చెందిన కంపెనీలకు వందల కోట్ల రూపాయల విలువ చేసే పలు కాంట్రాక్టు పనులను భారత్ రద్దు చేసినప్పటికీ.. స్పందించలేదు చైనా. కానీ, యాప్స్ నిషేధంపై మాత్రం తక్షణమే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

అలాగే ఈ అంశాన్ని అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలు, ఆయా దేశాల ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగానే తమ వ్యాపార కార్యకలాపాలను కొనసాగించాలని ఆదేశాలను జారీ చేశామని, దానికి అనుగుణంగానే తమ దేశ సంస్థలు యాప్స్‌లను రూపొందించారని అన్నారు. సరిహద్దు వివాదాల నేపథ్యంలో భారత్-చైనా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version