చైనా తగ్గిన బర్త్ రేట్.. కారణం ఇదే..!

-

డ్రాగన్‌ దేశం చైనా జనాభా తగ్గింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. అయితే.. జనాభా ఎక్కువ కావడంతో అక్కడ జననాల రేటు ఎక్కువే. కానీ 60 ఏండ్లలో తొలిసారి సీన్ రివర్సైంది. చైనాలో జనాభా పెరుగుదల తగ్గిపోయింది. 1961 తర్వాత చైనా పాపులేషన్ తగ్గడం ఇదే తొలిసారి. 2022 డిసెంబర్ నాటికి చైనా జనాభా 141,17,50,000 గా ఉంది. అంటే దాదాపు 140 కోట్లు. అంతకు ముందు ఏడాదితో పోలిస్గతే ఈ సంఖ్య 8.50 లక్షలు తక్కువని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా స్థానాన్ని భారత్ భర్తీ చేయనుంది.

గతేడాది చైనాలో అతి తక్కువ బర్త్ రేట్ నమోదైంది. 2022లో బర్త్ రేట్ ప్రతి వెయ్యి మందికి 6.77గా ఉంది. 2021లో ఇది 7.52గా ఉంది. అంతేకాదు 1976లో చైనాలో అత్యధిక మరణాల రేటు నమోదైంది. ప్రతి వెయ్యి మందికి 7.37 మరణాలు సంభవించాయి. దీనికి తోడు 1980 నుంచి 2015 వరకు ఆ దేశం అవలంబించిన వన్ చైల్డ్ పాలసీ జనాభా తగ్గేందుకు కారణమైంది. ఈ విధానం కొన్నేండ్లకు వికటించింది. చైనా జనాభాలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. పని చేసే యువత సంఖ్య భారీగా తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వం సింగిల్ చైల్డ్ పాలసీని రద్దుచేసింది. అయినా ఎలాంటి ఫలితాలు లేకపోవడంతో 2021లో ముగ్గురు పిల్లల పాలసీని తీసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version