మాల్దీవుల వివాదం.. చైనా వక్రబుద్ధి బయటపడింది…!

-

ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పరిసరాలపై మాల్దీవులు మంత్రులు ఎంపీల వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. చైనా మరోసారి తన వక్రబుద్ధిని చూపించండి మాల్దీవులకు మరింత దగ్గర అవ్వడానికి ట్రై చేస్తూ చైనా భారత్ మరింత విశాల దృక్పథంతో ఆలోచించాలని నోరు పారేసుకుంది. చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ లో ఓ వార్త ని ప్రచురించారు. మాల్దీవులని మేము ఎప్పటికీ సమాన భాగస్వామిగా పరిగణిస్తాము సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం.

భారత్ చైనా మధ్య ఘర్షణలు కారణంగా ఢిల్లీకి దూరంగా ఉండాలని మాల్దీవులకు ఎప్పుడు చెప్పలేదు ఈ ద్వీపదేశానికి భారత్ నుండి వచ్చే సహకారాన్ని ముప్పుగా భావించలేదు. దక్షిణాసియాలో కొన్ని దేశాలతో ఢిల్లీ సంబంధాలు దెబ్బతిన్నాయి. దానికోసం చైనా నిందించడం మానేసి భారత్ మరింత విశాల దృక్పథంతో విధానం పరమైన నిర్ణయాలు తీసుకోవాలంటూ అక్కసు వెళ్లగక్కింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో మయిజ్జు మాల్దీవులు అధ్యక్ష బాధ్యత తీసుకున్న విషయం తెలిసిందే వచ్చి రాగానే భారత్ బలగాలని తొలగించేలా చర్యలు జరగడం మొదలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version