చైనా దుశ్చర్య.. తైవాన్ పైకి మళ్లీ యుద్ధ విమానాలు

-

చైనా దుశ్చర్యలకు అంతు లేకుండా పోతుంది. పొరుగు దేశాలతో గిల్లికజ్జాలు పెట్టుకుంటూనే ఉంది. ఇటు భారత్ తో సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణం అవుతుంది. మరో వైపు తైవాన్ ను భయపెట్టేలా ప్రవర్తిస్తూ తన విస్తరవాదాన్ని భయటపెడుతోంది. గత వారం తైవాన్ ఎయిర్ జోన్ లోకి రెండు సార్లు చైనా తన యుద్ద విమానాలను పంపింది. గత శుక్రవారం 38 యుద్ధ విమానాలను, శనివారం మరో 39 విమానాలు తైవాన్ ఏయిర్ డిపెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ లోకి చొరబడ్డాయి. తాజా సోమవారం రికార్డ్ స్థాయిలో 52 యుద్ధవిమానాలు పంపింది. దీంట్లో 36 జే-16 విమానాలతో పాటు 12 హెచ్-6 బాంబర్ విమానాలు ఉన్నాయి. ఘటనపై తైవాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తైవాన్ నేషనల్ డే అక్టోబర్ 10కు ముందు చైనా దుశ్చర్యకు పాల్పడటం తైవాన్ లో ఆందోళన రేకిత్తిస్తోంది. ఇటీవల  తైవాన్ 11 దేశాల ట్రాన్స్ ఫసిఫిక్ పార్ట్నర్  షిప్ ట్రేడ్ యూనియన్లో చేరింది. దీన్ని చైనా సహించలేకపోతోంది. ప్రపంచం వన్ చైనా విధానానికి కట్టుబడి ఉండాలంటూ హెచ్చరిస్తోంది. మరోవైపు యూఎస్ఏ చైనా చర్యపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇది ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి భగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version