చైనాకు షాక్ మీద షాక్.. వింటర్ ఒలింపిక్స్ బహిష్కరించిన పలు దేశాలు.

-

డ్రాగన్ కంట్రీ చైనాకు షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే వింటర్ ఒలింపిక్స్ ను పలు దేశాలు దౌత్యపరంగా బహిష్కరిస్తున్నాయి. చైనాలో జిన్జియాంగ్ ప్రావిన్స్ లో ఉయ్గర్ మైనారిటీలపై చైనా చేస్తున్న దాష్టీకాలకు నిరసగా పలు దేశాలు ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నాయి.

ఇప్పటికే అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, యూకే దేశాలు చైనా లో జరిగే 2022 వింటర్ ఒలింపిక్స్ ను దౌత్య పరంగా బహిష్కరించాయి. మరోవైపు జపాన్, లిథువేనియా, న్యూజిలాండ్, స్కాట్లాండ్,  దేశాలు కూడా ఇదే తరహాలో ఒలింపిక్స్ ను బహిష్కరించే అవకాశం ఉందిని తెలుస్తోంది. తమ అధికారును పంపకుండా కేవలం క్రీడాాకారులను మాత్రమే పంపి చైనాకు నిరసన తెలియజేయనున్నారు.

అయితే ఈ బహిష్కరణ పై చైనా తీవ్రంగా స్పందిస్తోంది. బీజింగ్ వింటర్ గేమ్స్‌ను దౌత్యపరమైన బహిష్కరణ ప్రకటించడం ద్వారా అమెరికా ఒలింపిక్ స్ఫూర్తిని ఉల్లంఘిస్తోందని చైనా మంగళవారం ఆరోపించింది. దీనికి తప్పకుండా ప్రతి చర్య ఉంటుందని చైనా హెచ్చరిస్తోంది. జిన్‌జియాంగ్ మరియు టిబెట్‌లలో మానవ హక్కుల ఉల్లంఘనలు, హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య నిరసనలపై బీజింగ్ అణచివేత మరియు స్వయంపాలిత తైవాన్‌తో ఘర్షన వాతావరణం ద్వారా చైనా ఉద్రిక్తతలను కలిగిస్తోంది. దీంతో యూరోపియన్ యూనియన్ దేశాలు, అమెరికా వంటివి చైనా తీరును బహిరంగంగా ఎండగడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version