చైనాకు తగిన బుద్ధి చెప్పాలంటే ఇలా చేస్తే సరి.. డ్రాగన్‌కు మూడినట్టే.. ?

-

సైనికుడు అంటే స్వార్ధం లేకుండా దేశం కోసం పోరాడే వారని అర్దం.. ప్రతి తల్లిదండ్రులు తమ కొడుకు ఏ కలెక్టరో, సాఫ్ట్‌వేర్ ఇంజనీరో లేక మరేదైన ఉన్నతమైన ఉద్యోగం చేయాలని ఆశపడతారు.. కానీ నా కొడుకు సైనికుడై దేశం కోసం ప్రాణాలు అర్పించాలని కన్నవారు ఎవరు కూడా కోరుకోరు.. ఇలా ఆశించే వారు చాల తక్కువ మంది ఉంటారు.. నిజానికి మనదేశానికి సైనికున్ని అందించిన ప్రతి తల్లిదండ్రులు ధన్యులే.. ఎందుకంటే ఉద్యోగం చేసే వారు ఎప్పుడు ఇంటికి వస్తారో తెలుస్తుంది కానీ, దేశం కోసం పోరాడే సైనికుడు ఎలాంటి పరిస్దితుల్లో ఇంటికి వస్తారో తెలియదు..

ఇక మనజీవితంలో చైనా వస్తువులు ఒక భాగంగా ఇంతకాలం ప్రవర్తించాం.. కానీ నేటి నుండి చైనాకు సంబంధించిన ఏ వస్తువైనా, యాప్‌లైనా మనవి కావు.. వాడివి మనమెందుకు వాడాలి, మన కష్టార్జితం వాడికెందుకు అర్పించాలి.. అక్కడ బార్డల్లో మనకోసం సైనికులు పోరాడుతున్నారు.. వారికి మద్దతుగా మనం చైనా వాడు తయారు చేసిన ఏ వస్తువు జోలికి వెళ్లకుండా ఉండలేమా.. మనం భారతీయులం.. భరతమాత ఋణం తీర్చుకోవాలంటే జవాన్ కావలసిన అవసరం లేదు.. ఎక్కడో మంచులో యుద్ధం చేయవలసిన అవసరం లేదు.. ఇక్కడే మనం ఉన్నచోట నుండే మన యుద్ధాన్ని కొనసాగిద్దాం..

 

ఒక మనమే కాదు మన భారత ఇంటెలిజెన్స్ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంలో బుధవారం కీలక సూచనలు చేశారు. చైనాతో లింక్ ఉన్న 52 మోబైల్ అప్లికేషన్‌లను బ్లాక్ చేయాలని లేదా…. వాటిని వాడకుండా దేశ ప్రజలకు పిలుపునివ్వాలని పేర్కొన్నారు.. అలాంటి వాటిలో ముఖ్యంగా జూమ్ యాప్, టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, జెండర్, షేర్‌ఇట్ మరియు క్లీన్ మాస్టర్‌తో పాటు మరో 52 అప్లికేషన్లను ఇంటెలిజెన్స్ అధికారులు తమ జాబితాలో పేర్కొన్నారు. కాగా దీనికి జాతీయ భద్రతా కౌన్సిల్ కూడా మద్దతు పలికిందని, ఇవి భారత దేశ భద్రతకు అత్యంత ప్రమాదకారకాలని సంబంధిత అధికారులు ధ్రువీకరించుకున్నారని ఢిల్లీ వర్గాలు పేర్కొన్నాయి.

 

ఇక ఎక్కువగా మన ఇండియన్స్ ఉపయోగిస్తున్న జూమ్ యాప్ ఏమాత్రం సురక్షితం కాదని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌లోనే స్పష్టం చేసిన విషయం విదితమే. కాబట్టి మనం నిజమైన భారతీయులం అయితే మనవంతు పోరాటాన్ని చైనా పై నేటి నుండే మొదలుపెడదాం.. ఆదేశం తయారు చేసిన వస్తువులను వాడకుంటే మన ప్రాణాలైతే పోవుగా.. ఇలా చేస్తే వచ్చే దీని ఫలితం వల్ల చైనా ఆర్ధిక వ్యవస్దమీద కోలుకోలేని దెబ్బపడుతుంది.. ఇది మనకు సాధ్యమే.. కలిసి కట్టుగా పోరాడుదాం.. మన దేశాన్ని రక్షించుకుందాం..

Read more RELATED
Recommended to you

Latest news