ఫింగర్ 4 వద్ద తమ స్థానాలను దాటి… మరింత ఎత్తులో కూర్చొని ఉన్న భారతీయ దళాలను దృష్టి మరల్చడానికి చైనా ఆర్మీ సరికొత్త ఎత్తులు వేస్తుంది. లడఖ్ లోని ఫార్వర్డ్ పోస్టులలో చైనా ఆర్మీ భారీగా మోహరించింది. ఈ మానసిక యుద్ధ వ్యూహాన్ని చైనా సైన్యం ఇప్పుడు అమలు చేస్తుంది. 1962 యుద్ధానికి ముందు, చైనా సైన్యం బాలీవుడ్ / హిందీ పాటలను సరిహద్దుల్లో ప్లే చేసింది.
మాకు భారత భాషలు తెలుసు అని చెప్పే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా దాదాపు అవే యత్నాలు చేస్తున్నారు. భారతీయ ఆర్మీ సైనికులలో ఎక్కువ మంది హిందీ మరియు పంజాబీలలో మాట్లాడుకుంటారు. చైనా సైనికులు గతంలో హిందీ లేదా పంజాబీ పాటలను ఎక్కువగా వింటున్నారు. ఇది కచ్చితంగా చైనా ఆర్మీ కుట్ర అని, భారత ఆర్మీ వారి ట్రాప్ లో పడవద్దు అని కోరుతున్నారు.