ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఐపిఎస్ అధికారుల కొరతను ఎదుర్కొంటోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మంజూరు చేసిన 144 ఐపిఎస్ పోస్టుల్లో 115 మాత్రమే నింపబడ్డాయని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఏపీలో 29 మంది ఐపిఎస్ అధికారుల కొరత ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం రాజ్యసభకు తెలియజేశారు. తొమ్మిది మంది అధికారులను నేరుగా నియమించాల్సి ఉండగా, మరో 20 మంది ప్రమోషన్ కోటాలో ఉన్నారన్నారు.
ఐపిఎస్ అధికారుల కొరతపై ఇద్దరు వైయస్ఆర్సిపీ ఎంపీలు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , పరిమల్ నట్వానీ అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందించారు. కాగా ఏపీకి ఇతర రాష్ట్రాల నుంచి అధికారులను తెప్పించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా కొందరు తెలంగాణా అధికారులకు ఏపీలో పోస్టింగ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.