సమ్మక్క సారక్క ల పై త్రిదండి చిన్న జీయర్ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు వారు దేవుల్లే కాదంటూ విమర్శలు చేశారు చిన్న జీయర్ స్వామి. ”అసలు సమ్మక్క సారక్క ఎవరు ? బ్రహ్మ లోకం నుంచి దిగి వచ్చిన దేవతలా ? ఒక గ్రామ దేవతలు మాత్రమే. వారిని చదువుకున్న వారు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా నమ్ముతున్నారు. అదంతా పిచ్చి నమ్మకం ” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే చిన్న జీయర్ స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వివాదాస్పదంగా మారాయి. ఆంధ్ర చిన్న జీయర్ స్వామి మా తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైన సమ్మక్క సారలమ్మ మీద ఎందుకు ఈ అహంకారపూరితమైన మాటలు అని సీతక్క మండిపడ్డారు.
మా తల్లుల ది వ్యాపారమా, మా దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేదు కానీ కానీ మీరు మీరు పెట్టిన 120 కిలోల బంగారం గల సమతా మూర్తి విగ్రహం చూస్తానికి మాత్రం 150 రూపాయలు టికెట్ ధర పెట్టారు మీది బిజినెస్ మా సమ్మక్క సారలమ్మ తల్లి దగ్గర ఇలాంటి వ్యాపారం జరగదని ఫైర్ అయ్యారు. లక్ష రూపాయల తీసుకోకుండా ఏదైనా పేద వారి ఇంటికి మీరు వెళ్ళారా ? తెలంగాణ ప్రభుత్వం వెంటనే రియల్ ఎస్టేట్ స్వామి అయినా చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై స్పందించాలి తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు…
https://www.youtube.com/watch?v=BJskUDdOiy0