Chiranjeevi : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి

-

మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన జూబిలీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఇక ఈ సమావేశంకి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజానికి ముఖ్య మంత్రిగా రేవంత్ రెడ్డిని ప్రకటించిన తర్వాత చిరంజీవి అందరికంటే ముందుగా కంగ్రాట్యులేషన్స్ తెల్పిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెల్పొందిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు డిసెంబర్ 7న ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అప్పుడే కొత్త సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూ ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి శుభాభినందనలు. ఇకపై మీ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రము మరింతగా అభివృద్ధి పథంలో సాగాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నాను. అలాగే ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్కకు, ఇతర మంత్రులందరికీ శుభాకాంక్షలు’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news