సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రేపు(డిసెంబర్ 26) ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడితో భేటీ కానున్నారు.తెలంగాణకు రావాల్సిన నిధులు,విభజన సమస్యలపై మోడీతో చర్చలు జరపనున్నారు. భట్టి విక్రమార్క రేపటి ఖమ్మం జిల్లా పర్యటనను వాయిదా వేసుకుని ఢిల్లీకి వెళ్లనున్నారు.రేపు ఢిల్లీకి మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో వెళ్ళనున్నారు.తొలిసారి సీఎం హోదాలో ప్రధాని మోడీతో భేటీ కానున్నారు రేవంత్ రెడ్డి.పెండింగ్ లో ఉన్న రాష్ట్ర విభజన హామీల గురించి మోడీతో చర్చలు జరపనున్నారు.
అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధరప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సిన సుమారు 700 కోట్ల పైచిలుకు విద్యుత్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ అంశంపై కూడా మోడీతో చర్చించే అవకాశం ఉంది.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంతో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తనవంతు సహకారం అందిస్తుందని ప్రధాని మోడి ఎక్స్ లో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రేవంత్ రెడ్డి తొలిసారి ప్రధాని మోడిని కలుస్తూ ఉన్న సందర్భంగా ఏమేమి అడుగుతారో అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.