మెగా మూవీకి ముహూర్తం కుదిరింది…..!!

-

టాలీవుడ్ మెగాస్టార్ నటించబోయే తదుపరి 152వ సినిమాకు సంబందించి ఇప్పటికే అధికారిక పూజా కార్యక్రమాలు జరిగాయి. వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నాయి. నేటి సమాజానికి ఉపయోగపడే మంచి మెసేజ్ తో పాటు పలు రకాల మాస్ మరియు కమర్షియల్ హంగులతో దర్శకుడు కొరటాల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు గోవిందా హరి గోవిందా అనే టైటిల్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ అయిందని,

అలానే మెగాస్టార్ ఇందులో రెండు పాత్రల్లో నటిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా అసలు ఎప్పుడు మొదలవుతుంది అనే దానిపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. కాగా నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించడం జరుగుతుందని, అలానే రెగ్యులర్ షూటింగ్ జనవరిలో మొదలవుతుందని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా కథ పూర్తిగా సిద్ధం అయినప్పటికీ,

కథలో కొద్దిపాటి మార్పులు చేయాలని చిరంజీవి, రామ్ చరణ్ చెప్పడంతో వాటిపై కసరత్తు చేస్తున్నారట కొరటాల అండ్ టీమ్. కాగా ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలానే ఇటీవల మెగాస్టార్, సురేందర్ రెడ్డి ల కలయికలో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమాకు సంగీతం అందించిన అమిత్ త్రివేదినే ఈ సినిమాకు కూడా సంగీతాన్ని అందిస్తున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియాలంటే మాత్రం మరి కొద్దిరోజులు ఓపికపట్టాల్సిందే…. !!

Read more RELATED
Recommended to you

Exit mobile version