God Father: గాడ్ ఫాద‌ర్ నుంచి మ‌రో క్రేజీ అప్డేట్! ఆ కీ రోల్ కి ఓకే చెప్పిన స‌ల్లూ బాయ్‌!

God Father: మెగాస్టార్ చిరంజీవి అప్‌క‌మింగ్ మూవీ.. “గాడ్ ఫాదర్”. మలయాళ బ్లాక్ బస్టర్ హిటైయిన లూసిఫర్ కు రీమేక్ ఈ చిత్రం. ఆల్రెడీ ఈ చిత్రం తెలుగులో డబ్ అయినప్పటికీ పలు మార్పులు చేసి.. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు మ‌ళ్లీ తెస్తున్నారు. తెలుగు నేటివిటీకి అనుకూనంగా క‌థ‌ను మర్చి రాశారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండ‌గా.. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పకురాలుగా ఉన్నారు. ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన ప్రీ లుక్ అభిమానుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా గురించి ఓ లేటేస్ట్ బ‌జ్ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ అగ్ర నటుడు, కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్ న‌టించ‌నున్నార‌ట‌. స‌ల్మాన్ ఖాన్ ఏంటీ .. అది తెలుగు మూవీలో .. చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డ‌మేంట‌ని అనుకుంటున్నారా? వివ‌రాల్లోకెళ్తే.. మాళ‌యంలో విడుదలైన ’లూసీఫర్’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన పృథ్వీరాజ్.

ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర‌ను పోషించారు. ఈ పాత్ర చాలా ఆ క‌థ‌కు చాలా ప్ర‌ధానం. ఇప్పుడు తెలుగులో వ‌స్తున్న గాడ్ ఫాద‌ర్ లో .. అదే పాత్ర కోసం సల్మాన్ ఖాన్ ను సెలెక్ట్ చేశార‌ట‌.
ముందుగా ఈ పాత్ర కోసం రామ్ చరణ్ పేరును పరిశీలించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ పేరును ప‌రిశీలించారు. కానీ , ఫైనల్‌గా సల్మాన్ ఖాన్ సెలెక్ట్ చేశార‌ట‌. ఈ విష‌య‌మై.. ఆయ‌న‌ను సంప్రదించగా.. ఆయ‌న కూడా ఆ రోల్ చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

అంతేకాదు ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కోసం ఓ పాటను కొంచెం పాత్ర నిడివి కూడా పెంచినట్టు సమాచారం. ఈ సినిమా కోసం.. సల్మాన్ ఖాన్ 15 రోజులు డేట్స్ ఇచ్చాడట. ఇతని పాత్ర నిడివి కూడా 15 నిమిషాలు మాత్రమే ఉంటుందని టాక్‌. స‌లూ పాత్రకి తెలుగులో రాంచరణ్ డబ్బింగ్ చెబుతాడంట‌. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాల‌ని భావిస్తున్నార‌ట మూవీ మేక‌ర్స్. సో… అందుకు తగ్గట్టుగా సినిమాలో పలు మార్పులు చేర్పులు చేసినట్టు సమాచారం.