రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ జీవితాలని మొదలుపెట్టి…రాజకీయంగా ఎదిగిన నాయకులు చాలామంది ఉన్నారు. కానీ టిడిపిలో ఎదిగిన కొందరు నాయకులు ఆ టిడిపికే చుక్కలు చూపిస్తున్నారు. అలా టిడిపికి చుక్కలు చూపిస్తున్న వారిలో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు ఉంటారని చెప్పొచ్చు. అసలు కొడాలి రాజకీయ జీవితం టిడిపి మొదలైన విషయం తెలిసిందే.
2004 ఎన్నికల్లో టిడిపి తరుపున గుడివాడలో పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు వైఎస్సార్ హవాలో కూడా నాని గెలిచారు. ఇక ఇదే సీన్ 2009లో రిపీట్ అయింది. నాని మళ్ళీ గెలిచేశారు. కానీ ఆ తర్వాత కృష్ణా జిల్లాలో దేవినేని ఉమా పెత్తనం ఎక్కువ అవ్వడంతో నాని సైడ్ అయిపోయారు. టిడిపిని వీడి వైసీపీలోకి వచ్చేశారు. వైసీపీలోకి వచ్చాక నాని….అదే టిడిపికి గుడివాడలో ఓటమి రుచి చూపించారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించేశారు. ఇప్పుడు మంత్రిగా సత్తా చాటుతున్నారు. ఇక నాని మీడియా సమావేశం పెడితే చాలు….చంద్రబాబుకు చుక్కలే. ఆ రేంజ్‌లో బాబుపై ఫైర్ అవుతారు.
అలా ఫైర్ అయ్యే నానికి చంద్రబాబు ఏ మాత్రం చెక్ పెట్టలేకపోతున్నారు. గుడివాడలో టిడిపి పూర్తిగా వీక్ గా ఉంది. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ నాని టిడిపికి చుక్కలు చూపించడం ఖాయమని చెప్పొచ్చు. నాని బాటలోనే వల్లభనేని వంశీ వెళుతున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వంశీ…గన్నవరం నుంచి గెలిచారు. ఆ తర్వాత వైసీపీలోకి జంప్ చేశారు. వంశీ జంప్ అవ్వడానికి కారణం కూడా దేవినేని ఉమానే.
ఇలా వైసీపీలో వంశీ రావడంతో గన్నవరంలో టిడిపికి దిక్కు లేకుండా పోయింది. బచ్చుల అర్జునుడుని ఇంచార్జ్‌గా పెట్టిన ఫలితం లేదు. వంశీ ఫాలోయింగ్ ముందు అర్జునుడు ఏ మాత్రం సరిపోరు. కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో గన్నవరంలో వంశీ వైసీపీ వైపు బరిలో దిగి టిడిపికి చుక్కలు చూపించడం ఖాయం.