ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ !

-

గాడ్‌ ఫాథర్‌ సక్సెన్‌ ను మెగాస్టార్‌ చిరంజీవి బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరుసగా మీడియా సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న నిర్వహించిన కార్యక్రమంలో.. ఓ విలేకరి.. ఓటీటీ ఎంట్రీ గురించి చిరంజీవిని అడిగారు. అయితే.. తన ఓటీటీ ఎంట్రీ ప్రశ్నపై అయితే చిరు ఓ క్లారిటీ ఇచ్చారు.

ఓటిటి లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, మంచి సబ్జెక్టు దొరికితే అందులో కూడా డెఫినేట్ గా చేస్తానని తెలిపారు. అంతేకాకుండా లాక్ డౌన్ టైం లో తాను ఏమో ఒప్పుకున్నట్టు వచ్చిన వార్తలు అయితే అవాస్తవం అని మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు. అలాగే తాను స్మాల్ స్క్రీన్ పై మీలో ఎవరు కోటీశ్వరుడు చేశారని కూడా గుర్తు చేశారు. మరి ఓటీటీ ఎంట్రీ అయితే బాస్ నుంచి ఎప్పుడు ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version