సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించిన చిరంజీవి

-

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే…ఈ కోవిడ్ పై పోరులో ఒకే రోజు 13,72,481 వ్యాక్సిన్ లు వేసి ఏపీ ఆదర్శంగా నిలిచింది. గ్రామ, వార్డ్ సచివాలయాలు, వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పీహెచ్సీ డాక్టర్లు, మండల అధికారులు, జేసిలు, కలెక్టర్ల సమిష్టి కృషితో ఏపీ సర్కార్‌ చేపట్టిన మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ సక్స్‌స్‌ అయింది. మొన్న ఏపీ సర్కార్‌ చేపట్టిన ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌పై ఇప్పటికే పలుగురు ప్రశంసలు కురిపించారు. అయితే.. ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌పై తన ట్విట్టర్‌ వేదికగా స్పందించారు మెగాస్టార్‌ చిరంజీవి.

ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ‘ఏపీ వైద్య సిబ్బంది ఒకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయడం ఓ గొప్ప కార్యక్రమం. దీని పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. వైద్య సిబ్బంది కృషి ఫలితంగా కరోనా భూతాన్ని ఓడించగలమనే ఆత్మ విశ్వాసం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. ఈ ప్రయత్నాలను కొనసాగించాలి. సీఎం జగన్‌ ది చాలా స్ఫూర్తిదాయం నాయకత్వం. ఆయనకు అభినందనలు తెలిపుతున్నాను. ‘ అంటూ మెగాస్టార్‌ చిరు ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version