ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలి అనేది మెగాస్టార్ చిరంజీవి భావన. రాజకీయాలకు కొన్ని రోజులుగా ఆయన దూరంగా ఉన్నా సరే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆయన కొన్ని అవకాశాల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా తనకు మంచి వర్గం ఉండటంతో ఆ వర్గం సహకారంతో చిరంజీవి నిలబడే ప్రయత్నాలు ఎక్కువగానే చేస్తున్నారు. రాజ్యసభ సీటు వైసీపీ నుంచి ఆశించినా సరే ఇప్పుడు ఆయనకు ఆ అవకాశం మాత్రం రాలేదు. రాజ్యసభ సీటు మోహన్ బాబు కారణంగా రాలేదు అనేది ఆయన భావన.
రాజకీయాల్లో ఆయనకు అంత టాలెంట్ లేకపోయినా సరే సినిమాలకు దూరంగా ఉండి ఇప్పుడు రాజకీయాలకు దగ్గర కావాలని చూస్తున్నారు చిరంజీవి. అందుకే ఇప్పుడు వేగంగా బిజెపిలో జాయిన్ అయిపోయే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని ఆయన రెండేళ్ళ క్రితమే దాదాపుగా వదిలిపెట్టారు కూడా. ఆయనకు కేంద్ర మంత్రి అవ్వాలి అనే బలమైన కోరిక ఉంది. కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి అయిన సమయంలో ఆయన పని తీరు చాలా మందికి నచ్చింది కూడా అప్పట్లో. ఆ శాఖ మీద ఆయనకు పట్టు కూడా ఉంది.
ఇప్పుడు మళ్ళీ ఆ పదవి కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికలు అవ్వలేదు కాబట్టి కరోనా ప్రభావం తగ్గిన తర్వాత జరిగే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు ఆయన బిజెపిలో జాయిన్ అవ్వాలని ఈ లోపు బిజెపి అధిష్టానాన్ని దగ్గర చేసుకుంటే తనకు కలిసి వస్తుంది అనే భావన లో ఆయన ఉన్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎలాగూ బిజెపి తో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి కూడా లాక్ డౌన్ సమయంలో ప్రధాని మోడిని ఎక్కువగా కొనియాడుతున్నారు.