15 బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్.. విష్ణుప్రియ స్టేట్మెంట్‌లో కీలక విషయాలు

-

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌లో భాగంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌‌కు విచారణకు హాజరైన యాంకర్, యాక్టర్ విష్ణుప్రియ విచారణలో భాగంగా కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌లో భాగంగా భారీగా డబ్బులు తీసుకున్నట్లు విష్ణు ప్రియ ఒప్పుకున్నట్లు సమాచారం.

మొత్తం 15 బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వీడియోలను సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టా ద్వారా చేసినట్లు పోలీసులకు వివరించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే విష్ణు ప్రియ బ్యాంక్ స్టేట్మెంట్స్‌ను పోలీసులు తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఆమె మొబైల్ కూడా పోలీసులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా,దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version