ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా అద్బుత ప్రదర్శన చేసి ఫైనల్లో న్యూజిలాండ్ జట్టును చిత్తు చేసిన విషయం తెలిసిందే. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా వరుసగా టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను వరుసగా నెగ్గింది. ఈ క్రమంలోనే బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లకు భారీ నజరానా ప్రకటించింది.
జట్టులోని ఆటగాళ్లలో మరింత జోష్ నింపేందుకు, ఛాపింయన్స్ ట్రోఫీలో భాగస్వాములైన వారందరికీ రూ.58 కోట్లు నగదు బహుమతిని బీసీసీఐ ప్రకటించింది. కాగా, ఛాపింయన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన భారత్‌కు ఐసీసీ రూ.19.50 కోట్ల ప్రైజ్‌మనీ అందజేయగా.. రన్నరప్‌గా నిలిచిన కివీస్ జట్టుకు రూ.9.70 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది.