చిరంజీవి వాల్తేరు వీరయ్య హిట్టా.. ఫట్టా..!

-

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రం తర్వాత డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈరోజు సంక్రాంతి పండుగ కానుకగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య విడుదల అయింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు ఓవర్సీస్ లో కూడా భారీ డిమాండ్ స్థాయిలో సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. ఇకపోతే అక్కడినుండి మొదటి టాక్ ఏంటి అనేది ఇప్పుడు వైరల్ గా మారింది. ఇకపోతే ప్రీమియర్ షో ద్వారా వీక్షించిన అభిమానులు సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని పంచుకున్నారు. మరి చిరంజీవికి వాల్తేరు వీరయ్య సినిమా పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టిందా? లేదా ?అనేది ఇప్పుడు చూద్దాం.

ముందుగా స్టోరీ పాయింట్ ను రివీల్ చేయకపోయినప్పటికీ భారీ బోట్ యాక్షన్ సీన్ తో ఓపెన్ అయ్యే సినిమా వింటేజ్.. చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపిస్తూ మంచి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటూ ప్రీ ఇంటర్వెల్ వరకు ఆసక్తిగానే సాగింది. ఇంటర్వెల్ ఎపిసోడ్ తర్వాత ఒక రేంజ్ లో పూనకాలు తెప్పించే విధంగా సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో రవితేజ ఎంట్రీ ఆ తర్వాత చిరంజీవి, రవితేజ మధ్య వచ్చే సీన్స్ తో ఆసక్తికరంగా సాగుతుంది..

ప్రీ క్లైమాక్స్ కొంచెం రొటీన్ గా సాగుతున్నప్పటికీ క్లైమాక్స్ ట్విస్ట్ ఆసక్తిగా ఉంటుందని అంటున్నారు.. నిర్మాతలు చెప్పినట్టుగానే చాలా రొటీన్ గానే ఉన్నా కానీ ఓవరాల్ గా సినిమా మాత్రం మినిమం గ్యారంటీ అనేంతగా సాగుతుందని … వింటేజీ చిరంజీవిని చూపించడం యాక్షన్ సీన్స్.. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెబుతున్నారు. మొత్తానికైతే ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలవబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version