రిపబ్లిక్ డే సందర్భంగా.. 2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే.వారిలో 67 మందికి ఏప్రిల్ 22వ తేదీన పద్మ అవార్డుల్ని ప్రధానం చేయగా..మిగిలిన 65 మందికి గురువారం సాయంత్రం 6:30 గంటల నుంచి రాష్ట్రపతి ద్రౌపది ప్రదానం చేశారు.
రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డును చిరంజీవికి అందించారు. ఆయనతో పాటు పలువురు పద్మ అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉపరాష్ట్రపతి, పలువు కేంద్రమంత్రులతో పాటు అధికారులు హాజరయ్యారు.కాగా.. ఒక కానిస్టేబుల్ కొడుకుగా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి సొంతంగా కష్టపడి 150కి పైగా సినిమాలలో నటించాడు. అంతేకాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలకు సహాయము అందించాడు.కళా రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం చిరంజీవికి ఈ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే.