బాలయ్య, చిరంజీవి, సినిమాల టిక్కెట్ రేట్లు, షోస్ హైక్..!!

-

ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో బాలయ్య బాబు వీర సింహ రెడ్డి గా, చిరంజీవి వాల్తేరు వీరయ్య గా వస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య బాబు సినిమా  వీర సింహా రెడ్డి చిత్రం జనవరి 12 న రిలీజ్ కానుండగా, మెగాస్టార్  సినిమా వాల్తేరు వీరయ్య జనవరి 13 కి రిలీజ్ కానుంది. ఈ చిత్రాలు ఒకరోజు ముందుగానే యూఎస్ లో ప్రీమియర్ కానున్నాయి. ఇంకా థియేటర్స్ కోసం ఫైనల్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాల లో చిరు సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా, బాలయ్య కు ఎప్పటిలాగే తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాల వల్ల బాలయ్య, చిరంజీవి పోటీ గా కాకుండా తమన్ మరియు దేవీశ్రీ మధ్య పోటీ గా కూడా మారింది ఇప్పుడు ఈ సినిమాల తో పాటు తమిళ హీరోలు విజయ్ మరియు అజిత్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్న వేళ అందరికి థియేటర్స్ తగ్గే అవకాశం ఉంది.

అందుకే .’వాల్తేరు వీరయ్య’ ,’వీరసింహా రెడ్డి’ చిత్రాలు రెండింటికి టిక్కెట్ రేట్లు పెంచబోతున్నారని తెలుస్తోంది. అసలే ఇద్దరూ స్టార్ హీరోలు అందునా సంక్రాంతి కాబట్టి జనాలు పోటెత్తే ఛాన్స్ ఉందని అందుకే ఫ్యాన్స్ ఎంతయినా డబ్భులు పెట్టడానికి సిద్దంగా ఉంటారు కనుక దీనికోసం ఫర్మిషన్స్ తీసుకుంటున్నారట.అలాగే  పండుగ జరిగే మూడు రోజులుకు గాను రోజుకు 6 షోలు  వేసుకోవడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version