వైసీపీ నేతలకు చిరంజీవి వార్నింగ్..నాకు రాజకీయాలు కొత్త కాదు !

-

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా దసరా కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. అందుచేతనే చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్స్ ను చాలా వేగంగా చేస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా కు సంబంధించి పలు అప్డేట్లను కూడా ప్రకటిస్తూ ఉంది చిత్రం. అయితే ఇలాంటివి ఎన్ని చేస్తున్నా కూడా ఈ సినిమాకు అనుకున్నంత స్థాయిలో బజ్ రావడం లేదన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటిస్తూ ఉన్నారు. అలాగే నయనతార వంటి స్టార్ హీరోయిన్స్ కూడా నటిస్తూ ఉండడం గమనార్హం. ఇక సినిమా నుంచి ఇవాళ్టి నుంచి వరుసగా అప్టేట్స్‌ రానున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి డైలాగ్‌ ను తన ట్విట్టర్‌ లో రిలీజ్‌ చేశారు చిరంజీవి. నేనే రాజకీయాలకు దూరంగా ఉన్నా..కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే… చిరు తన ట్విట్టర్‌ వేదికలో పోస్ట్‌ చేయగానే.. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. వైసీపీ నేతలకు చిరు వార్నింగ్‌ ఇచ్చారని.. ముఖ్యంగా పేర్ని నాని చిరు వార్నింగ్‌ ఇచ్చారని కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version