చిరంజీవి నేతృత్వంలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు (తలసాని దృష్టిలో.. యాక్టివ్ గా ఉన్న సినీ పెద్దలు) ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసానితో చర్చలు జరిపారు. ఆ చర్చలకు బాలకృష్ణను ఎవ్వరూ పిలవలేదు. ఈ విషయాలపై హర్టయిన బాలయ్య… నన్ను ఎవ్వరూ పిలవలేదు, పత్రికల్లో చూసి తెలుసుకున్నాను అంటూ మాట్లాడారు. అక్కడితో ఆగని బాలయ్య… తలసానితో కలిసి హైదరాబాద్ భూములు పంచుకోవడానికి వెళ్లారా అంటూ విమర్శలు చేశారు! ఈ విషయాలపై నిర్మాత సి. కల్యాణ్ సున్నితంగా, నాగబాబు ఘాటుగా రిప్లై లు ఇచ్చిన సంగతి అలా ఉంచితే… ఇది “మెగా రివేంజ్” అంటున్నారు నెటిజన్లు!
గతంలో చంద్రబాబు హవా బలంగా నడిచిన రోజుల్లో దాదాపు ఒకవర్గం టాలీవుడ్ మొత్తం ఆయన్ చుట్టునే తిరిగేది! ఆయన కుర్చీ ఎక్కినపాటినుంచి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ స్మరించుకునేది! ఆసమయంలో ఒకవర్గం సినీ జనాల సంగతే అలా ఉంటే… ఆ రోజుల్లో బాలయ్య ఓ రేంజ్ లో రెచ్చిపోయారు! అందుకు ఉదాహరణ… బాబు హయాంలో జరిగిన లేపాక్షి ఉత్సవాలే! ఈ ఉత్సవాలకు సంబందించి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించలేదు. ఈ సందర్భంలో బాలయ్యను కదిపిన జర్నలిస్టులకు “అవును.. కావాలనే ఆహ్వానం పంపించలేదు.. ఎవర్ని పిలవాలో, ఎవర్ని పిలవకూడదో నాకు తెలుసు.. పిలిస్తే వచ్చే వాళ్లు చాలామంది ఉంటారు.. కానీ నేను పిలవను. నా స్టయిల్ లో డిక్టేటర్ పద్ధతిలోనే వెళ్తాను.. ఎవ్వర్ని పడితే వాళ్లను నెత్తిన ఎక్కించుకోను..” అంటూ స్పందించారు!
సరిగ్గా నాడు బాలయ్య స్పందనకు సంబందించిన ఆ వీడియోలనే నెటిజన్లు, మెగా ఫ్యాన్స్ ఆన్ లైన్ లో పోస్ట్ చేస్తూ.. బాలయ్యకు సమాధానాలు చెబుతున్నారు. గతంలో బాలకృష్ణ తనకు నచ్చినట్టు తాను వ్యవహరించారని, ఫలితంగా చిరంజీవి ఆధ్వర్యంలో ఇండస్ట్రీ కూడా ఇప్పుడు బాలయ్యను సైడ్ చేసి తనకు నచ్చినట్టు వ్యవహరిస్తోందని అంటున్నారు! నిన్నటివరకూ ఆన్ లైన్ వేదికగా చెలరేగిపోయిన బాలయ్య ఫ్యాన్స్ కు మెగా ఫ్యాన్స్ ఈ రకంగా సమాధానాలు చెబుతున్నారు! దీంతో… బాలయ్య ఫ్యాన్స్ నుంచి సమాధానం కరువైందనే అంటున్నారు నెటిజన్లు! ఫైనల్ గా.. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏమిటంటే… భూమి గుండ్రంగా ఉంటుందన్న విషయం ఏ ఒక్కరూ మరిచిపోకూడదు అని.. ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవ్వడం సహజమని!