నాని నిర్మాతల హీరో అని అందుకే అంటున్నారు ..!

-

కరోనా కారణంగా చిత్ర పరిశ్రమలో సంచలనాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రతీ ఒక్కరి రెమ్యూనరేషన్ లో కాస్త పట్టు విడుపు ఉండాలని నిర్మాతలు కోరుతున్నారు. అంతేకాదు ఈ విషయంలో దర్శకులు సహకరించాలని నిర్మాతలు అడుగుతున్నారు. అందుకే లాక్ డౌన్ కి ముందు అనుకున్న సినిమాలలో కొన్నిటికి చాలా మార్పులు జరుగుతున్నాయని తాజా సమాచారం. ఈ నేపథ్యంలో విదేశాలలో షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్న మేకర్స్ ఏమాత్రం ఆలోచించకుండా డ్రాపయ్యారు.

 

అక్కడ చేయాల్సిన సీన్స్ ని ఇక్కడే తెరకెక్కించేందుకు దర్శకులు ప్లాన్స్ చేసుకున్నారు. అందుకు తగ్గట్టు స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసుకున్నారు. ఇక సినిమా బడ్జెట్ల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తాజా సమాచారం. ఈ నేపథ్యంలోనే న్యాచురల్ స్టార్ నాని నటించబోతున్న ఒక సినిమా బడ్జెట్ లో కొంత మార్పులు చేస్తున్నారట. నాని నిర్మాతల హీరో అన్న సంగతి తెలిసిందే. అందుకే హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా నాని తో సినిమాలు నిర్మించడానికి మేకర్స్ ఎప్పుడు సిద్దంగా ఉంటారు.

అయితే టాక్సీవాలా తో హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించనున్న ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాకి ముందు అనుకున్న బడ్జెట్ 40 కోట్లు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అంత బడ్జెట్ ని కేటాయించడం కాస్త రిస్క్ అని నిర్మాతలు భావిస్తున్నారట. ఇందుకు నాని కూడా నిర్మాతలకే సపోర్ట్ గా ఉండి వాళ్ళు అనుకున్నట్టుగా కాస్త రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకున్నట్టు తెలుస్తుంది. ఎంతైనా నేచురల్ స్టార్ గొప్పోడే.

Read more RELATED
Recommended to you

Exit mobile version