చిన్ని కృష్ణ కి చిరంజీవి బంపర్ ఆఫర్..!

-

ఇంద్ర సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ ని తెచ్చుకున్నారు చిన్ని కృష్ణ తర్వాత కొన్ని సినిమాలు చేశారు కానీ అవేమీ కూడా కలిసి రాలేదు. కొన్నాళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి మీద ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఆ తర్వాత చిన్ని కృష్ణ మీడియాకి సినీ ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉన్నారు. తాజాగా ఒక వీడియోని రిలీజ్ చేయగా అది ప్రస్తుతం వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవికి అయిన క్షమాపణలు చెబుతూ పద్మ విభూషణ్ అందుకున్నందుకు శుభాకాంక్షలు చెప్పారు. పద్మ విభూషణం వచ్చినందుకు సంతోషంగా ఉందని శుభాకాంక్షలు తెలిపారని చిన్ని కృష్ణ చెప్పారు.

ఈ భూమి మీద పుట్టిన కొందరు తప్పులు చేస్తారు తప్పులు మాట్లాడుతారు నేను కూడా అంతే నా మీద నమ్మకంతో నన్ను పిలిచి ఇచ్చారు. చిరంజీవి గారు నాకు బ్యాడ్ టైం నడుస్తున్న టైంలో అనేక మాటలు మాట్లాడి ఇవ్వాల్సి వచ్చిందని పేరు చెప్పను కానీ కొంతమంది ఒత్తిడి వలన అన్నయ్య మీద అటువంటి మాటలు మాట్లాడాల్సి వచ్చిందని చెప్పారు మళ్లీ కలిసి పని చేద్దామని చూడు అన్నారు. ఇంద్ర 2 వంటి ప్రాజెక్ట్ సెట్ అవ్వాలని అవుతుందని చిరంజీవి గారు చిన్ని కృష్ణుని కలిసినప్పుడు అన్నారట ఆయన రిసీవ్ చేసుకున్న విధానం చూసి నాలో నేనే ఎంతో మదన పడ్డానని చిన్ని కృష్ణ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news