గుజరాత్ ఎన్నికల హోరు…త్రిముఖ పోరు.!

-

గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు నడుస్తోంది..ప్రధానంగా మూడు పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ-కాంగ్రెస్-ఆప్‌ల మధ్య త్రిముఖ పోరు జరగనుంది. ఇప్పటివరకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లే వార్ నడిచింది. ఇక బీజేపీనే అధికారం దక్కించుకునేది. కానీ ఈ సారి ఆప్..ఆ రెండు పార్టీలకు గట్టి పోటీ ఇస్తుంది. తాజాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ..కాంగ్రెస్‌తో పాటు ఆప్‌ని కూడా టార్గెట్ చేస్తున్నారంటే..ఆప్ రేసులో ఉందని అర్ధం చేసుకోవచ్చు.

అటు కాంగ్రెస్ సైతం ప్రచారంలో దూసుకెళుతుంది..రాహుల్ గాంధీ జోడో యాత్రలో ఉన్నా సరే పార్టీ కీలక నేతలు గుజరాత్ బాధ్యతలని భుజాన వేసుకున్నారు. కొత్తగా అధ్యక్షుడైన మల్లిఖార్జున్ ఖర్గే గుజరాత్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. అటు ఆప్ సైతం ప్రచారంలో సత్తా చాటుతుంది..అలాగే సరికొత్త హామీలు ఇస్తూ..బీజేపీ, కాంగ్రెస్ పార్టీలని వణికిస్తుంది. వచ్చే జనవరి 31వ తేదీకి పాత పింఛను విధానం అమలులోకి తెస్తామని, ఉద్యోగులు తమకు ఓటు వేసి గెలిపించాలని అరవింద్ కేజ్రీవాల్ కోరారు.

ఢిల్లీ, పంజాబ్ మాదిరిగానే గుజరాత్ ‌లో కూడా ఆప్ అధికారంలోకి వస్తుందని, 27 ఏళ్ల తర్వాత గుజరాత్ ప్రజలు బీజేపీ దుష్టపాలన నుంచి విముక్తి కాబోతున్నారని అన్నారు. అయితే గుజరాత్ ఎన్నికలు రెండు విడతలో జరగనున్నాయి. మొత్తం 182 స్థానాలు ఉన్న గుజరాత్ ఎన్నికలు మొదట విడత డిసెంబర్ 1న, రెండో విడత ఎన్నికలు డిసెంబర్ 5న జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.

అయితే ప్రస్తుతం గుజరాత్‌లో పార్టీల బలాబలాలు ఒక్కసారి చూస్తే..స్ట్రాంగ్ ఓటు బ్యాంక్‌తో బీజేపీ ముందు ఉన్నట్లే కనిపిస్తుంది గాని..కాంగ్రెస్, ఆప్ గట్టి పోటీ ఇస్తున్నాయి. ఆప్ వల్ల కాంగ్రెస్ ఓట్లు ఎక్కువ చీలి బీజేపీకి లాభం ఉంటుందని అంతా అనుకున్నారు గాని…పరిస్తితి చూస్తుంటే బీజేపీకి ఎక్కువ మద్ధతు ఉండే పట్టణ ఓటర్లు ఆప్ వైపు మొగ్గు ఛూపుతున్నారు. అటు గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు మొగ్గు కనిపిస్తోంది. ఇక ఎప్పటిలాగానే హిందుత్వ ఎజెండాతో బీజేపీ ముందుకెళుతుంది. పరిస్తితులు చూస్తే మళ్ళీ బీజేపీకే అధికారం దక్కుతుందని అన్నీ పోల్స్ అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్ సెకండ్, ఆప్ థర్డ్ ప్లేస్ లో ఉంటుందని చెబుతున్నాయి. మరి ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version