ఐపీఎల్ నుంచి క్రిస్ గేల్ అవుట్.. మానసిక ప్రశాంతత కోసమే..

-

రెండో విడత ఐపీఎల్ విజయవంతంగా సాగుతోంది. కరోనా కారణంగా రెండో విడత దుబాయ్ లో జరుగుతోంది. అన్ని జట్లు తమ ఆటతీరుతో అభిమానులను ఆనందాన్ని పంచుతోంది. అయితే ఐపీఎల్ లో ఆడే ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారిన పడకుండా, జట్ల యాజమాన్యాలు, ఐపీఎల్ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా కారణంగా ఆటగాళ్లంతా బయోబబుల్ వాతావరణంలో ఉంటూ క్రికెట్ ఆడుతున్నారు. ఇప్పుడు బయోబబుల్ వాతావరణం కారణంగా చాలా మంది ఆటగాళ్లు మానసికంగా ఒత్తడికి గురవుతున్నారు. ఈనేపథ్యంలోనే స్టార్ వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ ఐపీఎల్ కు దూరమవుతున్నారు. బయోబబుల్ వాతావరణంతో మానసికంగా అలసిపోయానని, రిప్రెష్ అవ్వడానికే ఐపీఎల్ కుదూరం అవుతున్నట్టు వెల్లడించారు. తనకు విరామం ఇచ్చినందుకు పంజాబ్ కింగ్స్ యాజమాన్యానికి క్రిస్ గేల్ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు టీ20 వరల్డ్ కప్ దగ్గర పడుతుండటంతో వెస్టిండీస్ జట్టుకు అందుబాటులో ఉండేలా మానసికంగా సిద్ధం కావడానికే ఐపీఎల్ కు దూరం అవుతున్నట్లు తెలిసింది. ఐపీఎల్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, టీ 20 వరల్డ్ కప్ బయోబబుల్ తప్పనిసరి. టీ20 వరల్డ్ కప్ కోసం వెస్టిండీస్ జట్టులో కలవడానికి ముందు క్రిస్ గేల్ దుబాయ్ లోనే ఉండే అవకాశం ఉంది. రెండో విడత ఐపీఎల్ ప్రారంభం అయిన తర్వాత  ఈ వెస్టిండీస్ స్టార్ రెండు మ్యాచులు ఆడాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version