షాకింగ్ ట్విస్ట్: మార్గదర్శి కేసులో A1 గా ఉన్న రామోజీరావుకు CID నోటీసులు !

-

గతంలో ఈనాడు సంస్థల అధినేతగా ఉన్న రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థను నడిపిన సంగతి తెలిసిందే. కానీ ఆ తరువాత ఈ సంస్థలో భారీగా అక్రమాలు జరిగాయన్న విషయంలో ఇతనిపై CID కేసు నమోదు చేసింది. కాగా ఈ కేసులో రామోజీరావు ను A1 గా మరియు చెరుకూరి శైలజను A2 గా కేసు షీట్ లో CID పొందుపరిచింది. ఈ రోజు ఉదయం ఈ కేసుకు సంబంధించి చెరుకూరి శైలజకు CID నోటీసులు ఇవ్వడం జరిగింది.

కాసేపటి క్రితమే రామోజీరావు కు సైతం నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నోటీసులో వీరిద్దరూ మార్చ్ 29 మరియు 31 , ఏప్రిల్ 3 మరియు 6 వ తేదీలలో విచారించాలని.. కాబట్టి అందుబాటులో ఉండాలని CID డీఎస్పీ రవి కుమార్ తెలిపారు. కాగా సంవత్సరాల పాటు ఈ కేసు సాగుతూనే ఉంది దీనికి ఒక ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version