సినీ పరిశ్రమ కీలక నిర్ణయం, సినిమా హాళ్ళు బంద్…?

-

కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తున్న నేపధ్యంలో సినీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. సినిమా షూటింగ్ తో పాటుగా సినిమా హాల్స్ ని కూడా కొన్నాళ్ళు ఆపేయాలని ప్రజలకు అవగాహన కల్పించాలని సినీ పరిశ్రమ భావిస్తుంది. ఈ మేరకు కీలక నిర్ణయం గురువారం సాయంత్రం గాని శుక్రవారం గాని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సిని పెద్దలు అందరూ కలిసి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఉన్న షూటింగ్ ని బంద్ చేసి కొన్నాళ్ళు కెమరా ఆఫ్ చెయ్యాలని యోచిస్తున్నారు. విదేశాలకు కూడా కొన్నాళ్ళ పాటు వెళ్ళకుండా ఉండాలని భావిస్తున్నారు. ముఖ్యంగా విదేశాల్లో షూటింగ్ ని కూడా రద్దు చేసే యోచనలో ఉన్నారు. హైదరాబాద్ లో పలు కీలక సినిమాల షూటింగ్ ని ఆపెసినట్టు సమాచారం. మా అసోసియేషన్ పెద్దలు కూడా దీనిపై చర్చించే అవకాశం ఉంది.

ఇక ఇదిలా ఉంటే హైదరాబాద్ లో కరోనా వైరస్ వ్యాప్తికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే అధికారులు అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. ఎక్కడికక్కడ హోర్డింగ్ లు ఏర్పాటు చేసి దీని వ్యాప్తిని అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అపోహలు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని చోట్లా సానిటేషన్ చేస్తున్నారు. ఐటి కంపెనీలు కూడా వర్క్ ఫ్రొం హోం ని ప్రకటించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version